« నిను చూడని క్షణము నీతో నుండని
Ninu choodani kshanamu
(DUDUDUDU) share with whatsapp

పల్లవి:
నీతో నుండని బ్రతుకు నిను చూడని క్షణము    
ఊహించలేను నా యేసయ్యా ఓ..   
నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు   
ఊహించలేను నా యేసయ్యా ఓ..   
నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను   
నాదు బ్రతుకులో సమస్తము కోలిపోయితి    (2X)
...నిను చూడని...
1.
నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి   
అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని    (2X)
అయినా అదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ   
నను వీడని కరుణ మరువలేనయ్యా.. యేసయ్యా   
...నీతో నుండని...
2.
నన్ను హత్తుకొన్న ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ    
నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్    (2X)
నను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు    
నీ తోనే నా బ్రతుకు సాగింతును.. యేసయ్యా   
నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు   
ఊహించలేను నా యేసయ్యా..     (4X)